Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వద్ధామ ఎంతవరకు వచ్చాడు..?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (22:07 IST)
యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం అశ్వద్ధామ. ఈ సినిమాని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మించారు. నూతన దర్శకుడు ర‌మ‌ణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య సరసన మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
 ఈ రెస్పాన్స్‌తో  మ‌రింత ఉత్సాహాంగా నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి  హీరో నాగ‌శౌర్య క‌థ‌ను రాయడం విశేషం. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా పై నాగ శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు.
 
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఫలానా అబ్బాయ్ - ఫలానా అమ్మాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి మరీ ఈ సినిమా చేసాడు. కెరీర్ ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడేలా భారీ విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి.. నాగ శౌర్యకి ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments