Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైరెక్ష‌న్లో ఇన్వాల్వ్ అవుతున్న‌ నాగ‌శౌర్య, ఇది నిజ‌మేనా?

Advertiesment
డైరెక్ష‌న్లో ఇన్వాల్వ్ అవుతున్న‌ నాగ‌శౌర్య, ఇది నిజ‌మేనా?
, శుక్రవారం, 20 డిశెంబరు 2019 (22:18 IST)
యువ హీరో నాగశౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం అశ్వ‌త్థామ. ఈ సినిమాకి నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణతేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీని నాగ‌శౌర్య త‌న సొంత బ్యాన‌ర్లో నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 31న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... నాగ‌శౌర్య డైరెక్ష‌న్లో ఇన్వాల్వ్ అవుతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఛ‌లో సినిమా టైమ్‌లో కూడా నాగ‌శౌర్య డైరెక్ష‌న్‌లో ఇన్వాల్వ్ అయ్యార‌ని టాక్ వినిపించింది.
అశ్వ‌త్థామ చిత్రానికి దర్శకుడు రమణ తేజ అయిన‌ప్ప‌టికీ... ప్రతి షాట్‌ నాగశౌర్య సెట్స్‌లో ఓకే చేసిన త‌ర్వాతే నెక్ట్స్ సీన్‌కి వెళ్లేవార‌ట‌. ఛ‌లో సినిమాకి కూడా ఇలాగే చేసిన‌ప్ప‌టికీ ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు క్లారిటీ ఉండ‌డంతో అదృష్టం కొద్దీ విజ‌యం సాధించాడ‌ని.. లేక‌పోతే నాగ‌శౌర్య మితిమీరిన జోక్యం వ‌ల‌న ఆ సినిమా కూడా అదుపుత‌ప్పేద‌ని ఆ టీమ్ మెంబ‌ర్సే అనుకునేవార‌ట‌. 
 
ఈ సినిమాకి నాగ‌శౌర్య నిర్మాత మాత్ర‌మే కాదు.. క‌థ‌ను కూడా అందించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహాంతో బాగా ఇన్వాల్వ్  అవుతున్నాడ‌ని అశ్వ‌త్థామ టీమ్ మెంబ‌ర్స్ అంటున్నార‌ట‌. న‌ర్త‌న‌శాల సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమాపై నాగ‌శౌర్య చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య చేస్తున్న ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి సినిమా స్టార్ట్ చేసినా కొంత బ్రేక్ ఇచ్చి మరీ... అశ్వ‌త్థామ చిత్రాన్ని చేస్తున్నాడు. ఏదిఏమైనా.. డైరెక్ట‌ర్‌కి ఫ్రీడం ఇస్తే.. మంచి సినిమా వ‌స్తుంది. అలా కాకుండా డైరెక్ష‌న్లో ఇన్వాల్వ్ అయితే.. న‌ర్త‌న‌శాల అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రూలర్‌' బాలయ్య ఏం చేశాడు? నట సింహం 105 చిత్ర సమీక్ష