Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపాత్రాభినయంతో బిగ్ బాస్ 4లో అదరగొట్టిన నాగ్

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:50 IST)
తెలుగు టెలివిజన్‌లో అత్యంత వినోదం కలిగించే నాన్-ఫిక్షన్ షో బిగ్ బాస్ 4వ సీజన్‌తో తిరిగి వచ్చింది. స్టార్ మా 2017లో ప్రారంభించిన ఈ కార్యక్రమం మన ప్రేక్షకులకు గొప్ప వినోదాన్ని అందించింది మరియు ప్రతి సీజన్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. బిగ్ బాస్ 4 సీజ‌న్‌కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేసారు. ఇందులో నాగార్జున ట్రిపుల్ పాత్రలో కనిపించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఒక తాత, కొడుకు మరియు మనవడు.. ఇలా మూడు గెటప్స్‌లో కనిపించిన నాగార్జున అంచనాలను అధిగమించారు. 
 
పిల్లల నుండి తాతామామల వరకు కుటుంబ సభ్యులందరూ చూసేలా బిగ్ బాస్ ను ప్లాన్ చేస్తున్నారు. తమ పొరుగువారి ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజల ఇంట్రస్ట్ చూపిస్తారు అని నాగార్జున చెప్పడం... తాత, కొడుకు. మనవడు.. ఈ మూడు గెటప్పులు నాగ్ కి బాగా సెట్ కావడంతో ఈ షో బిగ్ బాస్ 3 కంటే ఎక్కువు టీఆర్పీ రేటింగ్ సాధిస్తుందని ప్రొమోతోనే నమ్మకాన్ని కలిగించింది.  
 
వరుసగా రెండవ సంవత్సరం ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతున్న నాగార్జున మాట్లాడుతూ... “ప్రోమో కోసం షూట్ ఫ్లోర్‌లో తిరిగి రావడం సరదాగా ఉంది. గత సీజన్లో అద్భుతమైన విజయం సాధించిన తరువాత, ఈసారి మరింత వినోదాన్ని అందించాలని బిగ్ బాస్ 4 తో వస్తున్నాను. ఈ షో  మా ప్రేక్షకులకు మరింత వినోదం మరియు ఆశ్చర్యాలను అందిస్తుంది అన్నారు.
 
ప్రోమోలో తన లుక్ గురించి నాగార్జున మాట్లాడుతూ... “3 పాత్రలు చేయడం... బాడీ లాంగ్వేజ్, వాయిస్ మరియు అలవాట్లను ఇంత తక్కువ వ్యవధిలో పొందడం చాలా సవాలుగా అనిపించింది కానీ నేను దానిని పూర్తిగా ఎంజాయ్ చేసాను. ఆశ మరియు వినోదం ఎప్పుడూ ఆగకూడదని నేను నమ్ముతున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments