Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇస్తోన్న నాగ్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్‌లో ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్‌, మిస్ట‌ర్ బేచేరా, ఎల్‌వోసీ కార్గిల్ ... త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హిందీ సినిమాల్లో న‌టించ‌లేదు. తాజాగా నాగ్ బాలీవుడ్ మూవీలో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని టాక్ వినిపి

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (18:47 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్‌లో ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్‌, మిస్ట‌ర్ బేచేరా, ఎల్‌వోసీ కార్గిల్ ... త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హిందీ సినిమాల్లో న‌టించ‌లేదు. తాజాగా నాగ్ బాలీవుడ్ మూవీలో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. క‌రణ్‌ జోహార్‌ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో బ్రహ్మస్త్ర చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు నటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ చిత్రంలో నాగ్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ కోసం చాలా కాలంగా నాగ్‌ ఎదురుచూస్తున్నారు. బ్రహ్మస్త్ర దర్శకుడు అప్రోచ్‌ అవ్వటం, కథ నచ్చటం.. పైగా అమితాబ్‌ కూడా నటిస్తుండటంతో నాగ్‌ వెంటనే ఒప్పుకున్నాడని ఓ ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. అంతేకాకుండా... ముంబైలో త్వ‌ర‌లో జరగబోయే షెడ్యూల్‌కు నాగ్‌ హాజరు కాబోతున్నట్లు ఆ కథనం పేర్కొంది. ప్ర‌స్తుతం నాగార్జున నానితో క‌లిసి దేవ‌దాస్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments