Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిసిసి' కోసం కింగ్ నాగార్జున రూ.కోటి విరాళం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:09 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. దీంతో సినీ ఇండస్ట్రీ కూడా స్తంభించిపోయింది. ఫలితంగా అనేక మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో 'కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం' పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటైంది. దీనికి చిరంజీవి తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 
 
ఇపుడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. "లాక్‌డౌన్ అనేది భయంకర వాస్తవం, తప్పనిసరి పరిస్థితి. ఈ విపత్కర సమయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చిన నా సహనటులకు అభినందనలు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం నేను రూ.కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. మనందరినీ దేవుడు చల్లగా చూస్తాడు. అందరూ ఇళ్లలో సురక్షితంగా ఉండండ' అని నాగార్జున ట్వీట్ చేశారు. 
 
అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన వంతు సాయం ప్రకటించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో తిండి దొర‌క‌క ఇబ్బంది ప‌డుతున్న సినీ కార్మికుల‌కి త‌న వంతుసాయంగా రూ.25 ల‌క్ష‌లు ఇవ్వనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటున్న నేప‌థ్యంలో వారి కోసం రూ.25 లక్షలు ప్రకటిస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ కూడా రూ.25 లక్షలు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో "సిసిసి మనకోసం" (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ ఏర్పాటు చేశారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంక‌ర్, సి క‌ల్యాణ్, దాము క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments