Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ రూ.కోటి విరాళం - త్రివిక్రమ్ రూ.20 లక్షలు.. పీవీ సింధు రూ.5 లక్షలు

Advertiesment
మహేష్ రూ.కోటి విరాళం - త్రివిక్రమ్ రూ.20 లక్షలు.. పీవీ సింధు రూ.5 లక్షలు
, గురువారం, 26 మార్చి 2020 (15:58 IST)
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు.. తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులోభాగంగా, దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. అయినప్పటికీ కొత్త కేసుల నమోదు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల కోసం సినీ సెలెబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తనవంతుగా తెలుగు రాష్ట్రాల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నాయ‌ని, ఈ పోరాటం త‌న భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధిల‌కు కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు మ‌హ‌ష్‌బాబు తెలిపారు. బాధ్య‌తయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌నిభంద‌న‌ల్ని పాటించాల‌ని మ‌హేష్‌బాబు సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ఈ కష్టకాలంలో లాక్‌డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమనిబంధనలు పాటించాలని ఓ బాధ్యతగల పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఒకరికి ఒకరం మద్దతుగా నిలిచి మానవాళిని కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు. "ఈ పోరాటంలో విజయం మనదే... అప్పటివరకు ఇంటికే పరిమితవుదాం, సురక్షితంగా ఉందాం" అంటూ సందేశం వెలువరించారు. 
 
అలాగే, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తనవంతుగా ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మన దేశం కూడా కరోనా కారణంగా తీవ్రమైన ఆందోళన చెందుతోంది. కరోనా సహాయ చర్యల కోసం తమ వంతు సహాయాన్ని అందించడానికి ప్రముఖులంతా ముందుకు వస్తున్నారు. అలా త్రివిక్రమ్ కూడా ముందుకు వచ్చి తన వంతు సాయంగా, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇరు ప్రభుత్వాలకు ఈ విరాళాన్ని త్వరలోనే అందజేయనున్నట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే, బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్‌లో పేర్కొంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పుణ్యమాని తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్!