Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సింగర్ కనికాకు మూడోసారి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (14:08 IST)
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈమెకు సోకడమే కాదు.. ఈమె మరికొంతమంది అంటించారు. దీంతో ఆమెపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసుకు నమోదు చేశారు. అంతేకాకుండా, కనికా కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమెకు ఇప్పటివరకు మూడుసార్లు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు పరీక్షల ఫలితాలూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. 
 
కాగా, లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్ధారించారు. 
 
కాగా ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63 మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అటు క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments