బ్రిటన్ ప్రధానిని కాటేసిన కరోనా!!

Advertiesment
UK Prime Minister
నీవు ఎవరైతే నాకేంటి అంటోంది కరోనా వైరస్. చిన్నాపెద్దా అనే తేడా లేదు. పేదాడా లేక దేశాధ్యక్షుడా అనే తారతమ్యం లేదు. నీవు ఎవరైతే నాకేంటి.. నేను సోకకుండా ఉంటానా ఆంటోంది ఈ కరోనా వైరస్. దీనికి నిదర్శనమే... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కాటేసింది. ఆయనకు జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. 
 
గత 24 గంటలుగా బోరిస్ జాన్సన్ స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు ఆయన కరోనా టెస్టు చేయించుకోగా, పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది.
 
దాంతో 55 ఏళ్ల బోరిస్ జాన్సన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తాను కూడా కరోనా బారినపడ్డానని, అయితే, టెక్నాలజీ అండతో ఇంటినుంచే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న యువరాజు చార్లెస్‌కు నేడు బ్రిటన్ ప్రధానికి కరోనా