ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రిటీష్ రాజకుటుంబాన్ని తాకింది. 71 యేళ్ళ చార్లెస్ ప్రిన్స్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచారు.
అయితే, రోగ లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవని, చిన్నచిన్న సమస్యలు మినహా ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్టు వెల్లడించింది.
అలాగే, ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లాకు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు రాగా, వాటిలో నెగెటివ్ అని తేలింది. దీంతో రాజకుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు.
గతవారం రాజప్రసాదంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రిన్స్ పాలుపంచుకున్నారనీ, అనేక బృందాలతో కలిసి చర్చలు జరిపారని, వారిలో ఎవరో ఒకరి నుంచి ఈ వైరస్ వ్యాపించివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఎవరినుంచి సోకిందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు.
ప్రస్తుతం చార్లెస్ ప్రిన్స్‌తో పాటు.. ఆయన సతీమణి కెమిల్లాలు స్కాట్కాండ్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ క్వారంటైన్ హోంలో ఉంటున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 422 మంది మృత్యువాత పడ్డారు.