Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిందా? క్లారిటీ ఇచ్చిన విశ్వనటుడు

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (14:03 IST)
విశ్వనటుడు కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకినట్టు తమిళనాడు రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన నివాస ప్రాంతమైన ఆళ్వారుపేట, ఎల్డమ్స్ రోడ్డులో ఉన్న ఆయన ఇంటికి గ్రేటర్ చెన్నై నగర పాలక సంస్థ అధికారులు హోం క్వారంటైన్ నోటీసును అంటించడమే దీనికి కారణం. 
 
ఆ నోటీసులో మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ ఇల్లు హోం క్వారంటైన్‌లో ఉందంటూ పేర్కొన్నారు. ఈ పోస్టర్ కాస్త ఆ నోటా ఈ నోటాపడి.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు చేరింది. ఫలితంగా ఇది వైరల్ అయింది. కమల్ హాసన్ లేదా ఆయన కుటుంబంలోని వారికి కరోనా వైరస్ సోకిందనే ప్రచారం సాగింది. 
 
దీంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని కంకణం కట్టుకున్న విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా ఓ ప్రకటన జారీ చేశారు. హోం క్వారంటైన్ నోటీసు అంటించిన ఇంటిలో తాను నివాసం ఉడటం లేదనీ, అది తన సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంగా ఉందని వివరించారు. పైగా, తానుగానీ, తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికిగానీ కరోనా వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడింది. అదేసమయంలో తన నివాసాన్ని కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ ఆస్పత్రిగా మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. 
 
అయితే, కరోనా వైరస్ బారినపడుకుండా ఉండే చర్యల్లో భాగంగా, తమ కుటుంబ సభ్యులంతా సామాజిక దూరాన్ని పాటిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, కమల్ హాసన్‌ మొదటి భార్య సారికకు విడాకులు ఇచ్చారు. ఈమె తన చిన్న కుమార్తె అక్షరతో కలిసి ముంబైలో నివసిస్తోంది. పెద్ద కుమార్తె శృతిహాసన్ తండ్రి కమల్‌తో కలిసి చెన్నైలో నివసిస్తోంది. ఇక తనతో సహజీవనం చేసిన హీరోయిన్ గౌతమికి కూడా కమల్ హాసన్ దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments