Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్‌కు ఫౌండేషన్ స్టోన్ వేసిన నాగార్జున

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (16:19 IST)
మొన్నటి వరకు బిగ్ బాస్ 4 తెలుగు తో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. అక్కడి నుంచి ఫ్రీ అయిన తర్వాత సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు. ఈయన సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు.
 
తాజాగా ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా MD, CEO శ్రీధర్ రావు గారితో కలిసి పాల్గొన్నారు నాగార్జున. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు.
 
అక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నాగార్జున కాసేపు సేద తీరారు. మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాగార్జున కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
 
మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు నాగార్జున. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పలువురు కాలనీవాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments