Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓపిక టాస్క్.. కాస్త ఏడుపుగా మారిపోయింది.. మోనాల్ వర్సెస్ అరియానా

Advertiesment
ఓపిక టాస్క్.. కాస్త ఏడుపుగా మారిపోయింది.. మోనాల్ వర్సెస్ అరియానా
, బుధవారం, 9 డిశెంబరు 2020 (21:16 IST)
Ariyana_Monal
తెలుగు బిగ్ బాస్ 4 షో ముగియనుంది. రీసెంట్‌గా జబర్ధస్త్ అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షించేందుకు ఓపిక టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓ కంటెస్టెంటు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా రోబోలా కూర్చుంటే మిగతావారు సదరు వ్యక్తిని డిస్టర్బ్ చేయొచ్చు. ఏ ముహూర్తాన బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చాడో కానీ కంటెస్టెంట్లు సహనం కోల్పోయి మరీ ప్రవర్తిస్తున్నారు.
 
ముఖ్యంగా మోనాల్‌, అరియానా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. అరియానా తీరుతో మండిపోయిన సోహైల్ ఆమెతో కయ్యానికి కాలు దువ్వాడు. ఈ టాస్క్‌లో భాగంగా మోనాల్ రోబోలా కూర్చున్న అరియానాకు కోపం తెప్పించేందుకు ప్రయత్నించింది. ఆమెకు ఇష్టమైన బొమ్మను ఎక్కడో గోడపై పడేసింది. ఆమె డ్రెస్‌లో ఐస్‌క్యూబ్స్ వేసినట్లే వేసి తీసేసింది. అయితే ఎన్ని చేసినా తనకేమీ పట్టనట్లు అరియానా చలనం లేకుండా కూర్చుండిపోయింది.
 
కానీ టాస్క్ పూర్తైన మరుక్షణం మోనాల్‌పై విరుచుకుపడింది. ఆమె కళ్లల్లో తన మీదున్న పగను చూశానని చెప్పుకొచ్చింది. మనసులో ఇంత పగ పెట్టుకుని బయటకు బాగా మాట్లాడుతూ నటించిందని నిందించింది. ఈ రోజు మోనాల్ నాకు మొత్తం అర్థమైపోయిందంటూ ఆవేశపడింది. ఆ సమయంలో మోనాల్ సహనంగా ఉండాల్సిన టాస్క్ చేస్తుండటంతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయింది.
 
కానీ టాస్క్ పూర్తవగానే లోపలకు వెళ్లి గుక్కపెట్టి ఏడ్చింది. శూలాల్లా గుచ్చుకున్న ఆమె మాటలను తలుచుకుంటూ గుండెలవిసేలా రోదించింది. ఇది సహించలేకపోయిన అరియానా ఎదురు తిరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో అఖిల్ ..సోహైల్‌ను పక్కకు తీసుకెళ్లగా అభిజిత్ అరియానాను సముదాయించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె ఏడుస్తూ కిందపడిపోయింది. పడిపోయిన ఆమెను లేపే ప్రయత్నం చేశారు మిగిలిన సభ్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా