Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్‌బాయ్‌తో హ్యాపీ... అమ్రిన్ ఖురేషి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (14:27 IST)
మిథున్ చ‌క్ర‌వర్తి త‌న‌యుడు న‌మషి చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి బ్యాడ్ బాయ్‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా వుంద‌ని అమ్రిన్ ఖురేషి తెలియ‌జేస్తుంది. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్త మావ' చిత్రాన్ని 'బ్యాడ్‌బాయ్‌' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెట‌రన్ హీరో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి స‌ర‌స‌న హీరోయిన్‌గా అమ్రిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుద‌ల‌ కానుంది. అలాగే `జులాయి` రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో బ్యాడ్‌బాయ్ మూవీ సాంగ్ షూట్‌లో అమ్రిన్, న‌మ‌షి చ‌క్ర‌వ‌ర్తి పాల్గొన్నారు. అన్న‌పూర్ణ సెవ‌న్ ఎక‌ర్స్‌లో వేసిన భారీ సెట్లో  ఐదు రోజుల పాటు పాట చిత్రీక‌ర‌ణ జరిపారు.
 
ఈ సంద‌ర్భంగా అమ్రిన్ ఖురేషి మాట్లాడుతూ - నేను హైదరాబాద్ అమ్మాయిని. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టిస్తున్నాను. ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ హీరోయిన్‌గా హైద‌రాబాద్ వ‌చ్చి బ్యాడ్‌బాయ్ మూవీ సాంగ్ షూట్‌లో పాల్గొనడం హ్యాపీగా ఉంది.  అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో వేసిన గ్రాండ్ సెట్లో ఐదు రోజ‌ల‌పాటు పాట చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. సాంగ్ చాలా బాగా వ‌చ్చింది.
 
ఎన్నో సూప‌ర్‌హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన సీనియ‌ర్ మోస్ట్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ సంతోషిగారు నా ఫ‌స్ట్ మూవీ డైరెక్ట‌ర్ అవ్వ‌డం చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలుగు వారికి సుప‌రిచితుడైన మిథున్ చ‌క్ర‌వర్తి గారి త‌న‌యుడు న‌మషి చ‌క్ర‌వ‌ర్తి కూడా ఈ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌య‌వ‌వుతున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా చూపిస్త మామ చిత్రాన్ని ప్ర‌జెంట్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు కొన్ని మార్పులు చేశాం. త‌ప్ప‌కుండా తెలుగు వారికి కూడా బాగా న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం.
 
మ‌ళ్లీ జ‌న‌వ‌రి 1 నుండి 10 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటాను. న్యూ ఇయ‌ర్ కూడా ఇక్క‌డే సెల‌బ్రేట్ చేసుకుంటాను.  2020లోనే  నేను హీరోయిన్ అయ్యాను. ఇది నాకు చాలా హ్యాపీ ఇయ‌ర్‌. అలాగే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం నుండి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. 2021 కూడా నాకు బెస్ట్ ఇయ‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. ఈ రెండు చిత్రాల విష‌యంలోనూ చాలా  కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments