'బిగ్ బాస్-4' సీజన్ లో ముక్కు అవినాష్.. అరియానాల గోల అంతా ఇంతా కాదు. మొదట అరియానాతో పులిహోర కలిపేందుకు అవినాష్ బాగానే ప్రయత్నించినప్పటికీ.. తనకు ఆల్రెడీ ఒకరున్నారని అరియానా చెప్పడంతో.. వారి ట్రాక్ కాస్తా ఛేంజ్ అయ్యి ఫ్రెండ్షిప్ పట్టాలెక్కింది.
ఇద్దరూ మంచి స్నేహితుల్లా మెలిగారు. బయట మిత్రుల్లాగానే వీరు హౌస్‌లో మెదలడంతో ఈ జంటకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే ఈ ఇద్దరూ గొడవ పడుతూ.. మళ్లీ వెంటనే కలిసిపోయేవారు.
ఇకపోతే.. బిగ్ బాస్ 4 ముగిసింది. కానీ.. వీరి ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. వీరిద్దరినీ వివిధ టీవీ షోలకు పిలుస్తున్నారు. అవినాష్ అరియానా కూడా జంటగా వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరితో ఓ షో ప్లాన్ చేయడానికి టీవీ ఛానళ్లు చూస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే.. త్వరలో అవినాష్ అరియానా కలిసి ఒక టీవీ షో చేయడాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. వీరి ఫ్రెండ్షిప్ మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఏం జరుగుతందనేది చూడాలి.