Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్.. ఆ టాస్క్‌లో అరియానా విన్నర్.. సోహైల్‌ భార్యకు..?

Advertiesment
Bigg Boss 4 Telugu
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (14:13 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ త్వరలో ముగియనుంది. ఈ వారం చివరి ఎలిమినేషన్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం ఒకరు బయటకు వెళ్ళిపోగా.. ఎవరు టాప్-5లో వుంటారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ చివరి రోజుల్లో ప్రేక్షకులకు మరింత కనెక్ట్‌ అయ్యేందుకు కంటెస్టెట్లతో బిగ్‌బాస్‌ గేమ్స్ ఆడిపిస్తున్నాడు. ఈ ఆటల్లో ఎవరికి ఎవరు తగ్గకుండా కంటెస్టెంట్లు రఫ్ఫాడిస్తున్నారు. 
 
అధికారం.. ఓపిక అంటూ ఇంటిసభ్యులను పరీక్షపెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు ఏకాగ్రత టాస్క్‌ ఇచ్చారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన పనిని చేస్తూ తోటి ఇంటిసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ 30నిమిషాల సమయాన్ని గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కూడా అరియానా దుమ్మురేపేసింది. ఆఖరి వారంలో తానే స్ట్రాంగ్ అంటూ నిరూపించుకుంది ఈ బోల్డ్‌ అమ్మాయి.
 
ఇంటిసభ్యుల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు హింట్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ వారితో చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తున్నాడు. అందులో భాగంగా ఏకాగ్రత టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్ బజర్‌ మోగగానే మోనాల్ ఆట మొదలుపెట్టేసింది. జీరాను కౌంట్‌ చేయడం, తొక్కతీయడం స్ట్రార్ట్ చేసింది. ఇక అభిజిత్, హారిక, అరియానా ఒకదానికొకటి సంబంధం లేని ప్రశ్నలు వేస్తుంటే చిలిపి సమాధానాలు చెబుతూ హౌస్‌లో నవ్వులు కురిపించింది మోనాల్. ఈ టాస్క్‌లో మోనాల్‌కు హెల్ప్‌ చేసేందుకు అఖిల్‌, సోహైల్‌ విశ్వప్రయత్నాలు చేశారు. మిగతావాళ్లు పసిగట్టారు. కానీ పాపం మోనాల్‌ పట్టుకోలేకపోయింది. చివరకు 30 నిమిషాల సమయాన్ని సరిగ్గా గెస్‌ చేయలేకపోయింది.
 
నెక్ట్స్ గేమ్ స్ట్రార్ట్ చేసిన అరియానా హడావుడి చేస్తూనే పర్ఫెక్ట్ పర్పామెన్స్ ఇచ్చింది. బట్టలు సర్దుతూ. తొక్క తీస్తూ ఇంటిసభ్యులు అడిగిన క్వచన్స్ కి అన్సర్స్‌ చెబుతూ 30మినెట్స్ టైంని ఓ మోస్తారుగా గెస్‌ చేసి ఈ బేబీ ది బెస్ట్ అనిపించుకుంది. అరియానా, హారిక టాస్కు పూర్తయ్యాక అభి రంగంలోకి దిగాడు. ఈ హౌస్‌లో శివగామి ఎవరూ.? అని హారిక వేసిన ప్రశ్నకు టపీమని అభి అన్సర్ ఇచ్చాడు. శివగామిలో అందం మోనాల్‌కు, టెర్రర్ అరియానాకు, ప్రేమ హారికకు ఉందంటూ ఒకేసారి ముగ్గురికి పులిహోరా కలిపేశాడు అభి.
 
ఇక టాస్క్‌లోకి వచ్చిన సోహైల్‌ తనకు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పేశాడు. ఈయనగారి అవలక్షణాలన్ని భరించే లక్షణమైన అమ్మాయి కావాలంటా. ఎక్కడ ఎప్పుడు, ఎలా దొరుకుతుందో చూడాలి. ఈ టాస్క్‌లో ఎవరూ సరిగ్గా సమయాన్ని గెస్‌ చేయలేకపోయారు. అరియానా మాత్రం అందరికంటే బెటర్‌గా 37 నిమిషాలు గెస్ చేసి విన్నర్‌గా నిలిచింది. గోల్డెన్ మైక్ చేత పట్టుకొని మరోసారి ప్రేక్షకులతో ముద్దుగా మాట్లాడింది అరియానా. తనను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికి థ్యాంక్యూలు, ఐలవ్‌యూలు చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకొచ్చే మొగుడు ఎలా ఉండాలంటే.. వివరించిన రకుల్ ప్రీత్