Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్-నాని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నానిల క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతోన్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నా

Webdunia
సోమవారం, 21 మే 2018 (20:25 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నానిల క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతోన్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఇంత‌కీ ఎప్పుడంటారా..? ఈ మల్టీస్టారర్ వినాయక చతుర్థి కానుకగా సెప్టెంబరు 12న రిలీజవుతుందట. 
 
13న పండుగ కాగా.. ఒక రోజు ముందే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ రోజు బుధవారం కావడం విశేషం. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకోవడానికి ఇలా సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వారాంతంలో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశముంటుంది. వేసవితోనే తెలుగులో భారీ సినిమాల హవాకు తెరపడింది. మధ్యలో మీడియం రేంజి సినిమాలే వస్తాయి. 
 
ఇక రాబోయే పెద్ద సినిమా అంటే ఇదే అవుతుంది. కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయనడంలో సందేహం లేదు. హైప్‌కు తగ్గట్లే సినిమా అంటే పెద్ద విజయం సాధించే అవకాశముంటుంది. 
 
ఈ చిత్రాన్ని వినాయక చవితికి రిలీజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. సినిమాలో వినాయ‌క చ‌వితి నేపథ్యంలో ఒక పాట కూడా ఉంటుందట. ఆ నేపథ్యంలో పండక్కి సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించారు. అందుకే ఆగస్టుకు అనుకున్న ఈ చిత్రానికి సెప్టెంబరుకు వాయిదా వేశారు. 
 
ఇందులో నాగ్ డాన్ పాత్ర చేస్తుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. నాగ్ సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్నా నటించనున్నారు. మ‌రి...ఈ నాగ్ - నాని క‌లిసి ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments