Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జున గారు... వ‌ర్మ తొక్కేస్తున్నాడు సార్.. మీరే న్యాయం చేయాలి - రైట‌ర్ జ‌య‌కుమార్..!

నాగార్జున - వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమాని ఈ నెల 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. జూన్ 1న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అయితే... ఈ చి

Advertiesment
Writer Jayakumar post an open letter to Nagarjuna over RGV officer content
, శనివారం, 19 మే 2018 (18:33 IST)
నాగార్జున - వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమాని ఈ నెల 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. జూన్ 1న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అయితే... ఈ చిత్ర కథ నాదే... వర్మ కాపీ కొట్టేశాడు అంటూ జయకుమార్ అనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆఫీసర్‌ను వివాదం చుట్టుముట్టింది. నిజానికి వర్మ సినిమా అంటేనే వివాదం. టైటిల్ అనౌన్స్ మొదలు.. షూటింగ్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి విషయంలోనూ కంటెంట్ ఉన్నా లేకపోయినా కాంట్రవర్శి ఖచ్చితంగా కావాల్సిందే వర్మకు. 
 
అమితాబ్ బచ్చన్‌తో వర్మ చేసిన ‘సర్కార్ 3‘ చిత్రానికి కథ అందించింది తానే అని.. ఆ సమయంలోనే మొత్తం 9 కథలను వర్మకు వినిపించాననీ, అయితే ఆ కథలన్నీ నచ్చలేదని పక్కన పెట్టిన వర్మ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు తీస్తున్నారని జయకుమార్ ఆరోపించారు. ఇటీవల విడుదలైన ‘ఆఫీసర్’ ట్రైలర్ చూశానని, దానిలో సన్నివేశాలు, డైలాగులు తాను రాసుకున్నవే కావడంతో షాకయ్యానని జయకుమార్ ప్రకటనలో వెల్లడించారు. 
 
ఈ యువ రచయిత జయకుమార్ ట్విట్టర్‌లో ‘నాగార్జున గారూ.. సదరు డైరెక్టర్ (రామ్ గోపాల్ వర్మ) గారికి మీరు బ్రేక్ ఇచ్చారు కాని.. ఆయన కొత్తవాళ్ల కెరీర్‌ని బ్రేక్ చేస్తున్నారు. దయచేసి న్యాయం చేయండి అంటూ ట్వీట్ చేయగా.. మరో ట్వీట్‌లో నాగార్జున గారూ.. మిమ్మల్ని రీచ్ కావడానికి వేరే దారి లేక ఓపెన్ లెటర్ ఫార్మేట్ ఎంచుకున్నానే కానీ.. కొత్తవాళ్లకి అవకాశాలిచ్చి ఇండస్ట్రీని అభివృద్ది చేసిన మీ మీద నా రెస్పెక్ట్ ఎప్పటికీ పోదు అంటూ ‘ఆఫీసర్’ మూవీకి వర్మ తన వద్ద నుండి కాపీ కొట్టిన 25 పేజీల స్క్రిప్ట్‌ను సోషల్ మీడియా ద్వారా లీక్ చేశారు జయకుమార్. మ‌రి... ఈ వివాదం ఎక్కడవ‌ర‌కు వెళుతుందో..? నాగార్జున స్పందిస్తారో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బాయిల్లాగానే అమ్మాయిలూ వర్జినిటీ కోల్పోతున్నారు.. తప్పేలేదు : హీరోయిన్