అక్కినేని ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే వుంటారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూవుంటారు. వారి చిరునవ్వే నాకు ధైర్యం. ఎంతో పాజిటివ్ గా ఉంటూ మాకు థియేటర్స్, రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్. మా యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను అని నాగార్జున అక్కినేని అన్నారు.
నా సామిరంగ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అయ్యారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో నాగార్జున చేతులు మీదగా చిత్ర యూనిట్ కి సక్సెస్ షీల్డ్స్ ని అందించారు.
నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టిన రోజున విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అదే రోజున ఈ సినిమా మొదలుపెట్టాం. సినిమా ఓపెనింగ్ జరుగుతుందని మా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు. షూటింగ్ కి బయలుదేరుతుంటే ఎక్కడికని అమల అడిగింది. సినిమా మొదలుపెట్టాలి, వెళ్ళాలి అన్నాను. సాయంత్రం వెళ్ళొచ్చు కదా అంటే.. ''సంక్రాంతికి విడుదల చేయాలి. త్వరగా వెళ్ళాలి' అన్నాను. అప్పుడు అందరూ నన్ను బిత్తరమొహాలు వేసుకొని చూశారు. 'సంక్రాంతి విడుదల అంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా' అని పిల్లలతో సహా అందరూ అన్నారు. సినిమా మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి వస్తుందనే నమ్మకం బయట ఎవరి మొహాల్లో లేదు. కానీ నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం వుంది. మా నమ్మకం నిజమైయింది. విజయవంతంగా విడుదల చేశాం. అనుకున్న సమయానికి పూర్తి కావడానికి కీరవాణి గారు ఒక ప్రధాన కారణం. ఆయన ఒక టైం టేబుల్ వేసి మా అందరినీ ప్రోత్సహించారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీరవాణి గారికి ధన్యవాదాలు. సీ యూ నెక్స్ట్ సంక్రాంతి'' అన్నారు.