Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ స్టోరీని డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్న చైతన్య..!

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (21:03 IST)
యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావాలి కానీ... కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ లవ్ స్టోరీపై చాలా అంచనాలు ఉన్నాయి. సమ్మర్లో రిలీజ్ అంటూ ప్రకటించారు. 
 
ఆ తర్వాత సమ్మర్ రేసు నుంచి తప్పుకుంది అని వార్తలు రావడంతో చిత్ర నిర్మాతలు అలర్ట్ అయి అలాంటిది ఏమీ లేదు. సమ్మర్లో లవ్ స్టోరీని రిలీజ్ చేయడం ఖాయం. రిలీజ్ డేట్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలియచేసారు. అయినప్పటికీ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ పైన వార్తలు వస్తూనే ఉన్నాయి. మే 22 లేదా మే 29న లవ్ స్టోరీ రిలీజ్ కానుందని తెలిసింది. మరో వైపు లవ్ స్టోరీ జూన్ నెలలో రిలీజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. రిలీజ్ డేట్స్ పైన ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఏ పిల్ల అంటూ సాగే సాంగ్ ఫుల్ వీడియోను మార్చి 11న 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేసారు.
 
ఇదిలా ఉంటే... ఈ లవ్ స్టోరీ కోసం చైతు డిఫరెంట్ గా  ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ఇంతకీ ఏం చేసాడంటే... సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో వెళ్లిపోమాకే అనే పాట తన ఫేవరేట్ లవ్ సాంగ్ అని చెప్పి మీ ఫేవరేట్ లవ్ సాంగ్ ఏంటో చెప్పండని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనికి సమంత స్పందిస్తూ... ఏమాయ చేసావే చిత్రంలోని ఈ హృదయం అనే సాంగ్ తన ఫేవరేట్ లవ్ సాంగ్ అని ట్విట్టర్ ద్వారా తెలియచేయడం విశేషం.

చైతు ట్విట్టర్ లో ఫేవరేట్ లవ్ సాంగ్ ఏంటో చెప్పండని అడగడంతో నెటిజన్లు తమ ఫేవరేట్ లవ్ సాంగ్ ఏంటో చెప్పడం స్టార్ట్ చేసారు. నెటిజన్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ విధంగా చైతన్య తన లవ్ స్టోరీ మూవీని డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తూ.. ఆడియన్స్ లో ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments