Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతన్య, పరశురామ్ మిస్ అవ్వడం వలన ఆ డైరెక్టర్‌తో మూవీ చేస్తున్నాడా..?

Advertiesment
Nagachaitanya plans movie with vikram kumar
, మంగళవారం, 3 మార్చి 2020 (22:18 IST)
అక్కినేని నాగ చైతన్య మజిలీ, వెంకీ మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించి కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల దుబాయ్‌లో చైతన్య, సాయిపల్లవిల మధ్య ఓ పాటను కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వలన ఏప్రిల్ 2 లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని.. సమ్మర్ తర్వాత రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అలాగే ఏప్రిల్లో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ రిలీజ్ అవుతుండడంతో లవ్ స్టోరీ రిలీజ్ పోస్ట్‌పోన్ అవ్వడం నిజమే అనుకున్నారు. 
 
అయితే... ప్రచారంలో ఉన్న ఆ వార్తల్లో వాస్తవం లేదని లవ్ స్టోరీ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. దీంతో లవ్ స్టోరీ సమ్మర్ లోనే రిలీజ్ కానుందని తెలిసింది.
 
ఇదిలా ఉంటే... లవ్ స్టోరీ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేయాలనుకున్నారు కానీ.. పరశురామ్ మహేష్ తో సినిమా చేస్తుండడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగింది. దీంతో నాగచైతన్యతో సినిమా చేసేందుకు పలువురు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. 
 
తాజా వార్త ఏంటంటే... అక్కినేని ఫ్యామిలీకి మాత్రమే కాకుండా... తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచిన చిత్రం మనం. ఈ సంచలన చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ తో హలో అనే సినిమాని తెరకెక్కించారు.
 
ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా... ఫరవాలేదు అనిపించింది. అయితే.. హలో మూవీ షూటింగ్ టైమ్ లోనే చైతన్యతో ఓ సినిమా చేయమని నాగార్జున విక్రమ్‌ని అడిగారు. విక్రమ్ కూడా చైతన్యతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఆ తర్వాత విక్రమ్ వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీ కావడం.. చైతన్య వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీ కావడంతో ఇప్పటివరకు ఈ కాంబినేషన్లో మూవీ సెట్ కాలేదు. 
 
ఇప్పుడు చైతన్య - విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో మూవీ సెట్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.
 
 ఈ సినిమాకి రచయిత బి.వి.ఎస్. రవి కథ అందించడం విశేషం. త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని.. లవ్ స్టోరీ తర్వాత చైతన్య ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడని తెలిసింది. మరి.. అక్కినేని హీరోలతో మనం, హలో చిత్రాలు అందించిన విక్రమ్ కె కుమార్ చైతన్యతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రుచి ఎలా వుంటుందో చూడాలని ఉవ్విళ్లూరుతున్న శృతి హాసన్