Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు మూవీ కోసం వెంకీ, చైతు డైరెక్టర్, ఈ వార్త నిజమేనా?

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (20:50 IST)
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన త్రిష నటిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు కొరటాల శివ ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తుండడంతో.. చిరంజీవితో చేస్తున్న ఈ సినిమాతో ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో అనేది ఆసక్తిగా మారింది. ఆగష్టు 14న ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుకుమార్... ఈ స్ర్కిప్ట్‌లో మార్పులు చేసారని.. ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నందు వలన వేరే డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపించింది. ఈ లూసీఫర్ రీమేక్ డైరెక్టర్ ఇతనే అంటూ కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
 
సుకుమార్, వంశీ పైడిపల్లి, వి.వి.వినాయక్, శ్రీను వైట్ల, సుజిత్... తదితర దర్శకుల పేర్లు ప్రచారంలోకి రావడంతో వీరిలో ఎవరు లూసీఫర్ రీమేక్ కి డైరెక్టర్ అనేది ఆసక్తిగా మారింది. అయితే.. వి.వి.వినాయక్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ అనే సినిమా తీసారు. ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు ప్రయత్నించారు కానీ.. సరైన కథ సెట్ కాకపోవడంతో ఇప్పటి వరకు సినిమా చేయలేదు వినాయక్. అయితే.. నటుడుగా మారి శీనయ్య అనే సినిమా చేస్తున్నారు.
 
దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లూసీఫర్ రీమేక్ డైరెక్ట్ చేయమని అడిగితే.. ప్రజెంట్ శీనయ్య షూటింగ్ లో బిజీగా ఉండడం వలన తను చేయలేనని చెప్పేసాడని తెలిసింది. దీంతో లూసీఫర్ రీమేక్ కి డైరెక్టర్ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటూ.. యంగ్ డైరెక్టర్స్ సుజిత్, బాబీ పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. సుజిత్ ప్రభాస్ తో సాహో సినిమాని చేసారు. ఇక బాబీ రీసెంట్ గా విక్టరీ వెంకటేష్‌, యువ సమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో వెంకీమామ సినిమా చేసారు. మాస్ సినిమాలను, యాక్షన్ సీన్స్ ను బాగా తీస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.
 
అందుకనే బాబీ అయితే.. బాగుంటుందని కొణిదెల కాంపౌండ్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుజిత్, బాబీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది. మరి.. ఈ ఇద్దరిలో ఎవరు చిరుతో లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంటారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments