Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె విషయంలో అంతా క్లియర్ : నాగబాబు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో మెగా డాటర్ నిహారికతో పాటు అనేక మంది సినీ రాజకీయ నేతల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిహారికను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అంటూ వెల్లడించారు. అందువల్ల తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పబ్‌లో తన కుమార్తె నిహారిక ఉండటం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
అయితే, తన కుమార్తె విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశ్యంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments