'మత్తు'తో నాకు సంబంధమే లేదు : సినీ నటి హేమ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (15:17 IST)
హైదరాబాద్ నగరంలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఈ డ్రగ్ కల్చర్ తగ్గడం లేదు. పబ్‌లు, రేవ్ పార్టీల్లో జోరుగా సరఫరా అవుతుంది. తాజాగా ఓ నక్షత్ర హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ పబ్ పార్టీలోనూ లిక్విడ్ డ్రగ్ సరఫరా అయినట్టు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించారు. 
 
ఈ కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఏ సంబంధం లేదని తనను ఎందుకు బదనాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇందులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి, మెగా డాటర్ నిహారిక రొణిదెలతో పాటు పలువురు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి నోటీసులిచ్చి వదిలివేశారు. అయితే, ఆ పబ్‌కు తాను వెళ్లలేదని, కానీ కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తన పేరును ప్రస్తావిస్తూ అభాండాలు వేస్తున్నాయని నటి హేమ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments