Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ స్టెప్పులతో ఇరగదీసిన 'ఆర్ఆర్ఆర్' హీరోలు

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (12:31 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చేయేడాది జనవరి 7వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. 
 
ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన దోస్తీ మాట‌కు మాంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక నాటు నాటు అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని నవంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
 
తాజాగా నాటునాటు సాంగ్ ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో మాస్ స్టెప్పులు వేస్తున్న‌ట్టుగా వీడియోని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. వెండితెర‌పై వీరిద్ద‌రు చేసే ర‌చ్చ‌కి బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయంగా కనిపిస్తుంది. 
 
హై ఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్‌ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటను విడుదల చేయ‌నుండ‌గా, తెలుగులో ‘నాటు నాటు’ అంటూ ఆ పాట సాగనుంది. రేపు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఎంఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. 
 
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ హిస్టారికల్‌ మల్టీస్టారర్‌పై నేషనల్‌ వైడ్‌గా భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరణ్‌ సరసన అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments