Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" నుంచి ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు...’ రిలీజ్

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (15:21 IST)
సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. రామ్ చరణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి బుధవారం నాటు నాటు పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు...’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.
 
ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు.
 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments