Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా నా ఆకలి తీరలేదు - చిరంజీవి గారి ప్ర‌శ‌సం మర్చిపోలేనిది - సుధాకర్ కోమాకుల

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:14 IST)
Sudhakar Komakula
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో సుధాకర్ కోమాకుల. ఆ తర్వాత నటుడిగా 'క్రాక్'తో పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం 'రాజా విక్రమార్క' సినిమాతో ఈ శుక్రవారం ఏసీపీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఇందులో హీరో ఎన్ఐఏ ఏజెంట్ రోల్ చేశారు. సుధాకర్ కోమాకుల ఏసీపీ రోల్ చేశారు.  శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా విడుద‌ల ఈ సందర్భంగా సుధాకర్ కోమాకులతో ఇంటర్వ్యూ.
 
మీ పుట్టినరోజున సినిమా విడుదలవుతోంది కదా!
నవంబర్ 12న నా పుట్టినరోజు. అదే రోజు ఈ సినిమా విడుదల. అలా కుదిరింది. నిజంగా నాకు స్పెషల్ మూమెంట్. 
 
ఈ సినిమాలోకి మీరెలా వచ్చారు?
దర్శకుడు శ్రీ సరిపల్లి సుమారు పదేళ్లు నుంచి తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకు పని చేశాడు. అక్కడ నన్ను రెండు మూడు సినిమాలకు ఆడిషన్ చేశాడు. కెరీర్ పరంగా చూసినా... నేను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చేసినప్పుడు అతను సహాయ దర్శకుడిగా వేరే సినిమాలకు పని చేసేవాడు. నేను చేసిన‌ 'నువ్వు తోపురా' సినిమాకు చీఫ్ అసోసియేట్ గా పని చేశాడు. అలా మా మధ్య పరిచయం మరింత బలపడింది. ఈ సినిమా అనుకుంటున్న సంగతి నాకు తెలుసు. కార్తికేయతో ఓకే అయ్యిందని చెప్పాడు. ఒకరోజు ఫోన్ చేసి 'నువ్వు ఓ రోల్ చేయాలి' అన్నాడు. 'నేను చేయను. హీరోగా సినిమాలు చేస్తున్నాను' అని చెప్పా. 'చాలా మంచి రోల్. నీకు బావుంటుంది' అని అన్నాడు. నాకు ఆల్రెడీ రోల్ గురించి తెలుసు. 'నువ్వు తోపురా' సినిమా తర్వాత నాకు కొంచెం బ్రేక్ వచ్చింది.  హీరోగా సినిమాలు చేస్తూ మధ్యలో 'క్రాక్', ఈ 'రాజా విక్రమార్క' చేశా.
 
ఇందులో మీ రోల్ ఏంటి?
సినిమా పరంగా చెప్పాలంటే  కీలకమైన పాత్ర. గోవింద్ అని ఏసీపీ రోల్ చేశా. అతను హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూటిరీ ఆఫీసర్. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర గంభీరంగా ఉంటుంది. హీరో సహా మిగతా నటీనటులు అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. లుక్ బావుందని అందరూ ప్రశంసిస్తున్నారు.
 
హీరోగా చేస్తూ వేరే సినిమాల్లో రోల్ చేయడానికి ఆలోచించారా?
ఎప్పుడూ హీరోగా చేయాలని అనుకోలేదు. మంచి పాత్రలు వస్తే చేద్దామని అనుకున్నాను. కానీ, నాకు రాలేదు. ఇందులో కుదిరింది. ప్రస్తుతం కార్తికేయ యంగెస్ట్ సెన్సేషన్. తనతో చేయడం నాకు హెల్ప్ అవుతుంది. ఎట్ సేమ్ టైమ్. కాంబినేషన్ సీన్స్ చూడటం ఆడియన్స్ కు బావుంటుంది. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ కూడా అలా చూడటం లేదు. కార్తికేయ కూడా తమిళ్ 'వలిమై'లో విలన్ రోల్ చేశాడు. హీరోగా నా ఆకలి తీరలేదు. ఎక్కువ హీరో రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. మధ్యలో మంచి రోల్స్ వస్తే చేస్తాను.
 
 'క్రాక్'లో కానిస్టేబుల్, 'రాజా విక్రమార్క'లో ఏసీపీ కొన్ని రోజులు పోలీస్ అంటే సుధాకర్ కోమాకుల గుర్తుకు వస్తారేమో?
 'క్రాక్' ముందు రిలీజ్ అయ్యింది. కానీ, 'రాజా విక్రమార్క' ముందు అంగీకరించాను. కానిస్టేబుల్, ఏసీపీ. రెండు డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ సినిమాల్లో పోలీస్ పాత్రలు కాదు. వేరే రోల్స్ చేస్తున్నా.
 
శ్రీ సరిపల్లి మీ స్నేహితుడు కాబట్టి.మీ రోల్ ఇంపార్టెన్స్ పెంచడం జ‌రిగిందా?
అలా ఏం లేదు. రోల్ నచ్చడంతో నేను చేశా. ఆ పాత్రకు నేను అయితే బావుంటుందని అతను తీసుకున్నాడు. నా స్నేహితుడు నన్ను బాగా చూపిస్తాడనే నమ్మకంతో సినిమా చేశా.నటుడిగా నేను బాగా చేస్తే పెంచవచ్చు. సినిమా వరకూ మేమిద్దరం. నటుడు, దర్శకుడు. అంతే! నా కాస్ట్యూమ్స్, లుక్ పరంగా కేర్ తీసుకున్నాడు.
 
రెమ్యునరేషన్ ఎక్కువ ఇప్పించారట!
అటువంటివి చెప్పకూడదు (నవ్వులు). అయితే మా నిర్మాత '88' రామారెడ్డి గారు, సమర్పకులు ఆదిరెడ్డి .టి సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడికి కావాల్సింది ఇచ్చి బాగా తీశారు. 
 
మీరు లాక్‌డౌన్‌లో మెగాస్టార్ చిరంజీవి కోస‌మే 'ఇందువదన...' కవర్ సాంగ్ చేశారు. అది చూసి చిరంజీవి ప్రశంసించారు. ఎలా అనిపించింది?
లాక్‌డౌన్‌లో ఏదో ఒకటి చేయాలని చేశా. మొత్తం అమెరికాలో షూటింగ్ చేశాం. అది చూసి చిరంజీవిగారు వాయిస్ మెసేజ్ పంపించారు. 'ఇండియా వచ్చినప్పుడు కలుస్తా' అని మెసేజ్ చేశా. సరేననన్నారు. ఇండియా వచ్చాక. ఈ ఏడాది న్యూ ఇయర్ మెసేజ్ చేశా. వెంటనే రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ డే మేనేజర్ కాల్ చేసి... సండే అపాయింట్మెంట్ ఇచ్చారు. సాధారణంగా ఆయన ఆదివారం ఎవరినీ కలవరట. నా వైఫ్ అమెరికా వెళ్లిపోతుందేమోనని చిరంజీవిగారు కలిశారు. చాలా సంతోషం అనిపించింది. అదొక బ్యూటిఫుల్ మెమరీ. 
 
మీ భార్య‌ కూడా డాన్స్ బాగా చేశారు. ఆవిడతో ఎలా చేయించారు?
నా వైఫ్ హారిక చిన్నతనం నుంచి భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. తనకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ, తన ఫీల్డ్ ఇది కాదు. అందుకని, ఎప్పుడూ ఇటువైపు రాలేదు. సాంగ్ ఒక్కటి చేసింది.
 
ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?
హీరోగా 'నారాయణ అండ్ కో' చేస్తున్నాను. అందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. హీరోగా 'జీడీ' (గుండెల్లో దమ్ముంటే) అని మరో సినిమా చేస్తున్నాను. ఆర్మీకి వెళ్లాలని అనుకునే ఫ్ర‌స్టేటెడ్ యంగ్‌స్ట‌ర్‌ రోల్. ఆ కథ ఒక్క రాత్రిలో జరుగుతుంది. మరో సినిమా కూడా ఓకే అయ్యింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను. 
కొత్త బేన‌ర్ స్థాపించార‌ని తెలిసింది?
మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నా. యువ దర్శకులు నాకు తగ్గ కథలు రాస్తున్నారు. సుఖ మీడియా (SUKHA MEDIA)... పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశా. మంచి కథలు వస్తే మా భాగస్వామ్యంతో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేశా. అందులో నాకు జోడీగా '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య నటించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చేశారు. 'గాలి సంపత్' నిర్మాత సాయికృష్ణ ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఆ పాట విడుదల అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments