Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిష‌న్ ఇంపాజిబుల్ స్పూర్తిగా రాజా విక్రమార్క- దర్శకుడు శ్రీ సరిపల్లి

Advertiesment
మిష‌న్ ఇంపాజిబుల్ స్పూర్తిగా రాజా విక్రమార్క-  దర్శకుడు శ్రీ సరిపల్లి
, సోమవారం, 8 నవంబరు 2021 (16:05 IST)
Director Sri Saripalli
`ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్నీ ఉంటాయి. యాక్షన్ అంటే ఇరవైమందిని కొట్టడం టైప్ కాకుండా కొత్తగా, కథలో భాగంగా ఉంటుంది. 'మిషన్ ఇంపాజిబుల్' స్ఫూర్తిగా తీశా. తెలుగులో నిర్ణ‌యం వ‌చ్చినా దాన్ని మించిన స్థాయిలో మా సినిమా వుంటుంద‌ని` రాజా విక్రమార్క చిత్ర దర్శకుడు శ్రీ సరిపల్లి తెలియ‌జేస్తున్నారు. 
 
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీ సరిపల్లి చెప్పిన విశేషాలు.
 
- మాది విజయవాడ. అక్క‌డే 22 ఏళ్లు ఉన్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. యూనివర్సల్ స్టూడియోస్ లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేశా. నాలుగేళ్లు అక్కడి ఇండిపెండెంట్ సినిమాలకు పని చేశా. తర్వాత ఇండియా వచ్చి వీవీ వినాయక్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో జాయినయ్యా. 'నాయక్', 'అల్లుడు శీను' సినిమాలకు పని చేశా. ఇప్పుడు 'రాజా విక్రమార్క'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను.
 
- ఎన్ఐఏ నేపథ్యం అంటే యాక్షన్ వున్నా అందులో కామెడీ ట్రాక్ ఉండేలా చూసుకున్నాను. నేను సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్  లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యి ఉంటాడని అనుకున్నాను. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణగారి బృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశా. కామెడీ అంటే సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. క్యారెక్టర్లు జోకులు వేయవు. ఆ సందర్భాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వు వస్తుంది. 
 
-  హీరో ఎవరినైనా తీసుకుంటే బావుంటుందని అనుకున్నాను. రెండు మూడు ప్రయత్నాలు చేశా. 'ఆర్ఎక్స్ 100' టైమ్ లో కార్తికేయను చూశా. లుక్ సెట్ అవుతుందని అనుకున్నాను. తర్వాత మేం అనుకున్న క్యారెక్టర్ లో ఉన్న టైమింగ్ అతనిలో ఉందని తెలిసింది. కథ చెప్పాను. తనకి నచ్చింది. ముందు కార్తికేయ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాడు. క్రియేటివ్ గా, కమర్షియల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది.  సినిమా తీయడానికి రెండేళ్లు పట్టినా షూటింగ్ చేసింది 70 రోజులే.
 
- నేను క‌థ  రాసినప్పుడు ఎన్ఐఏ నేపథ్యంలో ఎక్కువ కథలు రాలేదు. తర్వాత వచ్చాయి.  అందుకే ఆయా సినిమాల్లో చూపించిన పెద్ద పెద్ద సమస్యలు నేను చూపించలేదు. చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగని, ఏదో చెవిలో పువ్వు పెట్టినట్టు ఏమీ చేయలేదు. ఎన్ఐఏ ఏజెంట్లు తీవ్రవాదులు మీద మాత్రమే కాదు, లోకల్ గానూ వర్క్ చేస్తారు. మా సినిమాలో దేశంలో సమస్య మీద ఎన్ఐఏ పోరాడుతుంది. 
 
- ఈ క‌థ‌కు మా దగ్గర ఉన్న టైటిళ్లలో ఇదే బెస్ట్ ఆప్షన్. చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకోవడం కాదు కదా! దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి కదా! అందుకని, ఆలోచించా. హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ కు 'రాజా విక్రమార్క' సూటవుతుందని పెట్టేశాం. 
 
-  తాన్యా రవిచంద్రన్ హోమ్ మినిస్టర్ కుమార్తెగా కనిపిస్తారు. క్లాసికల్ డాన్సర్ కూడా! ఇండిపెండెంట్ అమ్మాయిలా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఆమె క్లాసికల్ డాన్సర్. పశుపతి, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సుధాకర్ కోమాకుల ప్రతి ఒక్కరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. 
 
- ప్రశాంత్ ఆర్. విహారిని సంగీత దర్శకుడిగా తీసుకోవ‌డానికి  న్యూ ఏజ్ మ్యూజిక్ కోసమే. ఆయన ఇప్పటివరకూ ఇటువంటి జానర్ సినిమా చేయలేదు. అందుకని, అడిగా ఈ జానర్ కు సెట్ అయ్యేలా చేస్తారా? అని! ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు. 
 
- వ్యక్తిగతంగా  ఈ త‌ర‌హా సినిమా చేసినా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. నెక్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. లాక్ డౌన్ లో రాశా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖండ టైటిల్ సాంగ్ వచ్చేసింది