సగిలేటి కథ నుంచి రెండొవ లిరికల్‌ విడుదల చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రధన్

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (14:31 IST)
Ravi Mahadasyam, Vishika
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం సగిలేటి కథ. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం.
 
ఈ సినిమాలోని ‘అట్టా ఎట్టాగా' రెండొవ లిరికల్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ డిజిటల్ లాంచ్ చెయ్యగా, చిత్ర యూనిట్ కి విషెష్ తెలియజేసారు. చక్కటి మెలోడీ అందించిన ఈ గీతాన్ని రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాశారు. యశ్వంత్ నాగ్(పరేషాన్ మూవీ ఫెమ్), కమల మనోహరి ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు.
 
సగిలేటి కథ సినిమాలో ప్రతి సాంగ్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా 'అట్టా ఎట్టాగా' సాంగ్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమలో పడే సన్నివేశంలో ఈ సాంగ్ మొదలవ్వుతుంది. ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలుపుతున్నారు.
 
అలాగే, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సెరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments