Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకుంటోన్న ఏందిరా ఈ పంచాయితీ గ్లింప్స్

Advertiesment
Bharat and Vishika Laxman
, మంగళవారం, 22 ఆగస్టు 2023 (17:52 IST)
Bharat and Vishika Laxman
విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్లు విజయాన్ని సాధిస్తున్నారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.
 
ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లోగో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఊరి వాతావరణం, ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు, లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అని చెప్పేశారు. తాజాగా ఈ చిత్రం మరో అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 
 
‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.   
 
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం