Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ కథ తురుమ్ ఖాన్ లు ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా సోనూ సూద్

Turumkhan-sonusood
, బుధవారం, 30 ఆగస్టు 2023 (12:17 IST)
Turumkhan-sonusood
తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో పల్లె కథ చిత్రం "తురుమ్ ఖాన్ లు".స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తురమ్ ఖాన్ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 31 న SVIT కాలేజ్ సికింద్రాబాద్ లో ఘనంగా జరగనుంది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి వెండితెర హీరో సోనూ సూద్ చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో సర్వత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. భారీ మొత్తంలో ఈ వేడుకకు అభిమానులు హాజరవుతున్నారు.
 
తురుమ్ ఖాన్  చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన రంగు రంగుల చిలక పాట ఇప్పటికే విడుదలై సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకొని ప్రపంచవ్యాప్తంగా అవడానికి సిద్ధంగా ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎన్ శివ కళ్యాణ్ తురుమ్ ఖాన్ లు సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అసిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తారని తెలుగు సినిమా ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న తురుమ్ ఖాన్  చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా క్వాలిటీగా రూపొందించామని సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, చిన్న సినిమాగా తెరకెక్కినా విడుదల తర్వాత ప్రేక్షకులే దీన్ని పెద్ద సినిమా చేస్తారన్న నమ్మకంతోనే ఆగస్టు 31న ఎస్ వి ఐ టి కాలేజ్ సికింద్రాబాద్ లో జరుగునున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సోషల్ హీరో సోనూ సూద్ ను ఆహ్వానించామని మేకర్స్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెట్‌కి వెళ్లే ముందు అల్లు అర్జున్ డే అప్డేట్ ఇదే!