Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనూ సూద్ ప్రోత్సాహంతో పైలట్ అయ్యాడు

Advertiesment
sonusood-pailet
, గురువారం, 24 ఆగస్టు 2023 (13:02 IST)
sonusood-pailet
మానవతామూర్తి, దానశీలి, బాలీవుడ్ ప్రభంజనం సోనూ సూద్ తన దాతృత్వంతో, సేవాగుణంతో నిజ జీవితంలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయన మరెందరో జీవితాలను మార్చి ప్రజల గుండెల్లో ఆరాధ్యుడయ్యాడు. పైలట్ కావాలి అనుకున్న ఒక సామాన్యుడి కలను సాకారం చేశాడు సోనూ సూద్. ఈ రోజు, ఆ వ్యక్తి పైలట్‌గా ఏవియేషన్ అకాడమీలో గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. సోనూ సూద్ అంటే ఏంటో ఈ సామాన్యుడి కథ ప్రపంచానికి మరోసారి తెలియజేసింది.
 
పేదరికంలో జన్మించిన సోను అనేక కష్టాలను అనుభవించాడు. పైలెట్ కావాలి అనేది ఆయన కళ. కానీ అది అసంభవం అని ఎప్పుడూ తన పేదరికం తనకు గుర్తు చేస్తూ ఉండేది. తన ఆలోచన తప్పు అని, విధిరాతన సైతం మార్చే ఒక మహోన్నత వ్యక్తి సోనూ సూద్ ఉన్నాడు అన్న విషయం అతనికి అప్పుడు గుర్తుకు రాలేదు.
 
ఎయిర్‌లైన్‌లో హెల్పర్‌గా, క్లీనర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత, అతనికి ఊహించని వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు. అతనే దేశము గర్వించదగ్గ నటుడు, సామాజికవేత్త సోనూ సూద్. "సోనూ సూద్ నాకు సహాయం చేసాడు. సోను సూద్ స్ఫూర్తితో ఆయన ఫౌండేషన్ కు అభ్యర్థించిన వెంటనే నేను ఆర్థిక సహాయం పొందాను" అని అతను వివరించాడు. అది అతని జీవిత ఆశయానికి పునరుజ్జీవం ఇచ్చింది. అతని ఆకాంక్షలకు రెక్కలనిచ్చింది. అతన్ని ఒక పైలెట్ ను చేసింది.
 
సోనూ సూద్ వెలిగించిన ఒక దీపం నేడు ఎందరికో వెలుగునిస్తోంది. ఆయన నింపిన ఒక స్ఫూర్తి దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. ఆయన వ్యక్తి కాదు ఒక సామూహిక శక్తి "సోనూ సూద్‌ను విమానంలో ఎక్కించుకోవాలనేది నా కల, ఆ క్షణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు, నన్ను ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నాయి. నిజంగా రియల్ హీరో సోనూ సూద్ స్వయంగా నా విషయంలో గర్వపడుతున్నానని చెప్పడం నా జీవితానికి అత్యుత్తమ పురస్కారంగా భావిస్తున్నాను. ఆయన ప్రోత్సాహం నా జీవితాన్నే కాదు చాలా మంది జీవితాలను కూడా మార్చేసింది. నా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత, చాలామంది ప్రజలు నాలాగే పైలట్‌లు కావాలని కోరుకుంటున్నట్టు నన్ను కలిసి చెప్పడం సంతోషంగా ఉంది. సోను సూట్ అందించిన ఈ ప్రోత్సాహం అత్యంత పేద వాడు కూడా పైలట్ కాగలడని ప్రజల హృదయాల్లో ఆశ నెలకొంది. సోనూ సూద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
 
ఈ పైలట్ కథ సామాన్యుల్లో ఆశను చిగురింపచేస్తోంది. రియల్ హీరో సోను సూత్ తలుచుకుంటే తలరాతను మార్చిన ఈ కథనం నిదర్శనంగా నిలుస్తోంది. సమయానికి ప్రతిభావంతులకు నిజమైన హీరోలు చేయూతగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఈ కథ నిలువెత్తు సాక్ష్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతు, అఖిల్ సినిమాలు లైన్లో ఉన్నాయి - అన్నపూర్ణ స్టూడియోస్ లెగసీ కాపాడుకున్నాం: సుప్రియ యార్లగడ్డ