Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన`మడ్డీ` టీజ‌ర్‌

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (19:30 IST)
Muddy teaser
మడ్ రేసింగ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ఇంతకముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠ రేపేలా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  కాగా  'మడ్డీ' తెలుగు టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి శుక్ర‌వారం సాయంత్రం విడుదల చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందనీ, ఇలాంటి థీమ్‌తో సినిమా రావ‌డం గొప్ప విష‌య‌మ‌నీ, ఇందుకు దర్శకుడు ప్రగభల్ కి, టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
'మడ్డీ' టీజర్ రెసీ గా ఉంది. ముఖ్యంగా  రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె జీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. ఈ టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ  చిత్రం  ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్ కి తీసుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజ‌ర్‌ తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి.  
 
దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్న‌ప్ప‌టికీ  ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది. ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్  లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేయడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments