Webdunia - Bharat's app for daily news and videos

Install App

`క్లైమాక్స్`లో మోడీ డౌన్ డౌన్ వివాదానికి సెన్సార్ సెర్టిఫికెట్టే స‌మాధానం!

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:25 IST)
Rajendraprasad, Nasha sing
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మల్టీ జానర్ చిత్రం "క్లైమాక్స్" కి U/A సర్టిఫికెట్ వ‌చ్చింది. ఈ సినిమాను మార్చి 5న విడుద‌ల‌చేస్తున్నారు. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `క్లైమాక్స్`.ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడమే కాక అందులో `మోడీ డౌన్ డౌన్` అనే నినాదాలపై వివాదం అయింది. కాగా తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్ వాటన్నిటికి సమాధానం చెబుతుంది అంటున్నారు చిత్ర యూనిట్. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ లు నటించారు.
 
నిర్మాత మాట్లాడుతూ "ట్రైలర్లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రం పై అంచనాలని అమాంతం పెంచేసాయి. కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకముంది" అన్నారు.
 
చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ "నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా విచిత్ర కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్, బ్యాక్ డ్రాప్ కామెడీ, ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని కథనాలు ఉంటాయి.  మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో  మీ ముందుకు వచేస్తున్నాం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments