Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"క్లైమాక్స్"లో నటనను చూసి షాక్ అవుతారుః రాజేంద్రప్రసాద్

Advertiesment
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rajendraprasad, Bhavani sankar, etc
నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విదంగా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నామని అంటున్నారు చిత్ర దర్శకుడు భవాని శంకర్. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా  సింగ్,శ్రీ రెడ్డి,పృద్వి,శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె.  దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం "క్లైమాక్స్". ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని ట్రైలర్ ను విడుదల చేశారు. 
 
అనంతరం రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. భవాని శంకర్ తీసిన `డ్రీమ్` ఫిల్మ్ చూశాను . చాలా బాగుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే డిఫ్రెంట్ గా ఉంది.రాజేంద్రప్రసాద్ గారు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది.ఏ పాత్ర ఇచ్చినా ఈజీ గా నటించే రాజేంద్రప్రసాద్ గారితో "క్లైమాక్స్" సినిమాను భవాని శంకర్ తీశాడు .  డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న భవాని శంకర్ తను తీసిన "డ్రీమ్" ఫిల్మ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఈ మూవీ కూడా అంత కంటే పెద్ద హిట్ అయ్యి తనకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
 రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..* భవాని శంకర్ ఒక డిఫ్రెంట్,టఫ్ సబ్జెక్ట్ తో నా ముందుకు వచ్చాడు.ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయనటువంటి పాత్రలో నటించాను.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా షాక్ కు గురవుతారు.మనం సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశాము అనే దానికంటే మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అందరి సపోర్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులందరికీ
రీచ్ అవ్వాలి అప్పుడే ఇలాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు.తను తీసిన డ్రీమ్ సినిమా కమర్షియల్ గా ఎంతో హిట్టయింది.ఆ సినిమాకు తను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు .ఇప్పుడు మళ్లీ "క్లైమాక్స్" చిత్రం ద్వారా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు.ఇలాంటి మంచి మూవీలో అద్భుతమైన పాత్ర ఇచ్చిన భవానీశంకర్ నా కృతజ్ఞతలు.ఇందులో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.నేను చేసిన గెటప్స్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నటించడం జరిగింది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందని అభినందించడమే  కాక మీరే 100 మందికి చూడమని చెప్పేలా ఉంటుందని అన్నారు.
 
చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ..* నేను 2007 లో "ఐ వోట్ ఫ్రెండ్స్" షార్ట్  ఫిల్మ్ తీయడం జరిగింది. 300 సినిమాల్లో ఈ సినిమాకు బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అది సీ.ఎన్.ఎన్ & ఐ.బీ.ఎన్ ఛానల్స్ లలో కూడా ప్రసారం అయ్యింది.ఆ తర్వాత నేను 2011లో "డ్రీమ్" సినిమా తీశాను. దీనికి ఏడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అందులో ప్రామినెంట్ గా కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ,న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ రెండు ప్రామినెంట్ గా వచ్చాయి.ఏ తెలుగు సినిమా కూడా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ థియేటర్లో ఎప్పుడూ స్క్రీన్ చేయలేదు. డ్రీమ్ మూవీ ఫస్ట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో "క్లైమాక్స్" తో మీ ముందుకు వస్తున్నాను.రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప యాక్టర్. 40 సంవత్సరాల నుండి ఒక హీరోగా, కమెడియన్ గా, తాతగా అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు.ఒక ఎస్.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్ గారు  కనిపిస్తున్నారు. "క్లైమాక్స్" సినిమా మిస్టరీ, మర్డర్ మిస్టరీతో పాటు టర్న్స్ అండర్ బ్యాక్ డ్రాప్ కామెడీతొ ఒకటిన్నర గంట నిడివి ఉన్న మూవీ తీయడం జరిగింది. ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి.హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉన్న సినిమాగా విజువల్ బ్యూటీకి బాగా ప్రామినెంట్ ఇస్తూ మ్యూజిక్ కి పెద్దపీట వేసి తీసిన సినిమా క్లైమాక్స్ .ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ పెద్ద సినిమాలతో మేము వస్తున్నాము.  త్వరలో ఆడియో ను విడుదల చేసి సినిమా విడుదలకు ప్లాన్ చేస్తామని అన్నారు.
 
హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడుతూ..* ఇటువంటి డిఫరెంట్ కథా చిత్రం లో రాజేంద్రప్రసాద్ గారితో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనిరుధ్ ప్రేమలో మహానటి..? త్వరలో డుం డుం డుం!