Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటి చాలా సినిమాల పాయింట్‌లు 20 సంవత్సరాల క్రితం వచ్చినవే : సి. కల్యాణ్‌

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (19:21 IST)
Sohail, C. Kalyan, K. Achireddy, Koneru Kalpana
ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్‌. ఇదే వేదికపై నిర్మాత సి. కల్యాణ్‌ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా కేట్‌ కట్‌ చేశారు.
 
సందర్భంగా దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెరమీద పాత్రలు మిమ్మల్ని నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని నేను మార్చి 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను. మద్రాసులో ఉన్నప్పుడు నా సినిమాల ప్రివ్యూలకు వెళ్లి జనాన్ని గమనిస్తూ ఉండేవాళ్లం. ఏఏ సీన్‌లు ప్రజలను ఆకట్టుకున్నాయి.. ఎక్కడ జనాల మొహాల్లో రియాక్షన్స్‌ వస్తున్నాయి.. ఎన్ని సీన్‌లు పండాయి అని లెక్కలేసుకునే వాళ్లం. ఇది ఒక మేకర్‌కు చాలా అవసరం. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలు ఒకటి.. ఈ సినిమా నిర్మాత కల్పన గారు ఒకటి. ఎందుకంటే.. ఇంతకు ముందు నేను నా నిర్మాతను ఏ ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ను అడిగితే వారిని తెచ్చేవారు. కానీ కల్పన గారు మాత్రం నేను అడిగిన రేంజ్‌ వారికన్నా తగ్గేలే అంటూ ఇంకా పై రేంజ్‌ ఉన్న వారిని తీసుకొచ్చారు అందుకే ఈవిడ స్పెషల్‌ అని చెప్పేది. ఈ సినిమా కోసం మేం పడ్డ తపనకు ఫలితం వచ్చే రోజు మార్చి 3న కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
 
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల పాయింట్‌లు 20 సంవత్సరాల క్రితం వచ్చినవే. కాకపోతే కొత్త కొత్త హంగులు, ఆకర్షణలతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు, కుటుంబంలో ఉండే ప్రేమానుబంధాలను అద్భుతంగా చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఇందుకు ఉదాహరణగా ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను చెప్పాలి. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు ఖచ్చితంగా చెమర్చేలా ఈ ఎపిసోడ్‌ను ఆయన తెరకెక్కించారు. ఇందులో ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు.. కానీ భావం మన మనసును దృవింపజేస్తుంది. అంత ట్రెండీగా తీశారు కృష్ణారెడ్డి గారు. సన్నివేశాలు అయినా.. సంగీతం అయినా కృష్ణారెడ్డిగారి ముద్రలోంచి ఎక్కడా బయటకు రావు. ఏ సినిమా అయినా విడుదలైన తర్వాతే అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అని డిసైడ్‌ అయ్యేది. ఈ సినిమా కూడా రిలీజ్‌ తర్వాత పెద్ద విజయం సాధించి పెద్ద సినిమాగా మారుతుంది. ఖచ్చితంగా దీని తర్వాత కృష్ణారెడ్డి గారిని పెద్ద నిర్మాతలు డేట్స్‌ అడుగుతారు. నిర్మాతగా కల్పనకు డేర్‌ ఎక్కువ. ఈ విషయంలో నేను ఆమెతో తూగను. ఈ సినిమా మేకింగ్‌ కోసం ఆమె పెట్టిన ఖర్చు నాకు ఆశ్చర్యం వేసింది. ఆమెకు సినిమా మీద ఉన్న నమ్మకం అంది. సోహెల్‌కు ఈ చిత్రం తర్వాత మంచి మార్కెట్‌ వస్తుంది. దాన్ని అతను నిలబెట్టుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అజయ్‌ ఘోష్‌లో తెలివైన రావుగోపాలరావు, అతి తెలివైన ప్రకాష్‌రాజ్‌లు కనిపిస్తారు. అతను మంచి టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌. మీనా సహకారం ఎప్పటికీ మరువలేం. నిర్మాతల ఆర్టిస్ట్‌ ఆమె. రాజేంద్రప్రసాద్‌ గారితో నేను 9 సినిమాలు చేశాను. చాలా కంఫర్టబుల్‌ ఆర్టిస్ట్‌. నా కుటుంబ సభ్యుడితో సమానం. అచ్చిరెడ్డి గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి తదితరులు ఈ సినిమాను తమ స్వంత సినిమాగా భావించి  సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి లైఫ్‌ ఇస్తుంది అన్నారు.
 
హీరో సోహైల్‌ మాట్లాడుతూ.... ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను అని చాలాసార్లు చెప్పాను. 90ల్లో కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. అన్ని రంగాల్లోకి టఫ్‌ రంగం సినిమా. అందరూ సక్సెస్‌ వస్తే లైఫ్‌ సెటిల్‌ అయిపోయింది అంటారు. కానీ సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్‌ మొదలౌతుంది. ఎన్నో టెన్షన్స్‌తో థియటేర్స్‌కు వచ్చే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ... వారి కష్టాలను మర్చిపోయేలా చేయడమే ఆర్టిస్ట్‌ల బాధ్యత. ఈ సినిమాలో అ ఆబాధ్యతను 100 శాతం నెరవేర్చామని ఫీలవుతున్నా. నా ప్లేస్‌లో మరో హీరో ఎవరైనా ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది. కానీ నా టాలెంట్‌ను గుర్తించి నన్ను ఈ సినిమాలో హీరో పాత్రకు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా అందరూ థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయిన మా ‘ఆర్గానిక్‌ మామ ` హైబ్రీడ్‌ అల్లుడు’ చూసి, మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments