Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష టీజర్‌ను అభినందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan launch Virupaksha teaser
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (18:30 IST)
Pawan Kalyan launch Virupaksha teaser
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది.  కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌.

తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మవుతుంది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్‌ను మార్చి 1న‌ విడుద‌ల చేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ గారు క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా ఈ టీజ‌ర్‌ను వీక్షించారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంద‌ని ఎంటైర్ యూనిట్‌ను ఆయ‌న అప్రిషియేట్ చేస్తూ.. సినిమా చాలా పెద్ద విజయం సాధించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా.. 
 
చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అత్తారింటికి దారేది హీరో మ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మా విరూపాక్ష ట్రైల‌ర్‌ను చూశారు. ఆయ‌నకెంతో న‌చ్చింది. విజువ‌ల్స్‌, బీజీఎం అన్నీ బావున్నాయని తేజ్ తో స‌హా ఎంటైర్ టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. ఈ టీజర్ ని మొట్టమొదటగా ఆయనకి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ప్ర‌శంస‌లు మాకెంతో ఎన‌ర్జీని ఇచ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తేజ్ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన మూవీ ఇది. సరికొత్తగా ఉంటుంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 
న‌టీన‌టులు: సాయిధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్తా మీన‌న్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు: బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ దండు, సినిమాటోగ్రాఫ‌ర్ :  శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌,  మ్యూజిక్ డైరెక్ట‌ర్:  బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజయ్ భూపతి సౌత్ ఇండియన్ మూవీ మంగళవారం కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది