Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది సాయికుమార్‌తో జోడీగా మిర్నా మీనన్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (16:15 IST)
Mirna Menon
శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై నిర్మాత కెకె రాధామోహన్ త‌మ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
 
ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవ‌లే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మిర్నా మీనన్ ఆహ్వానించారు.  గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్లిద్దరికీ త‌గిన ప్రాధాన్యత ఉంటుంది.
 
సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. గిడుతూరి సత్య, కొలికపోగు రమేష్, రామకృష్ణ వరుసగా ఎడిటింగ్, ఆర్ట్, స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
 
సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
 
నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments