Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీస్ మార్ ఖాన్ లో పాప ఆగవే సాంగ్ విడుదల చేసిన వరుణ్ తేజ్

తీస్ మార్ ఖాన్ లో పాప ఆగవే సాంగ్  విడుదల చేసిన వరుణ్ తేజ్
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:46 IST)
Adi- payal
ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా 'తీస్ మార్ ఖాన్'. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆయన తీస్ మార్ ఖాన్ రూపంలో మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమా లోని 'పాప ఆగవే' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసి చాలా బాగుందని 'తీస్ మార్ ఖాన్' యూనిట్‌ని అభినందించిన ఆయన, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.  
 
'పాప ఆగవే' అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ 'వదలనే వదలనే నిన్నే నేను వదలనే' అంటూ చెప్పిన లైన్‌కి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాయగా.. కారుణ్య ఆలపించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరోహీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి.  
 
విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'తీస్ మార్ ఖాన్'  సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్నారు. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లాన్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా విడుదలైన సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.      
 
నటీనటులు: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మేజర్' విడుదలపై అడవి శేష్‌ అప్డేట్