విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మించిన "ఎఫ్-3" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలోని పాటల్లో తొలిపాటను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రం బృందం అధికారికంగా గురువారం వెల్లడించింది. "లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ" అంటూ ఈ పాటల సాగనుంది.
గతంలో వచ్చిన "ఎఫ్-2" చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రంరానుంది. ఇందులో తమని పట్టించుకోవడం లేదంటూ భార్యల పోరును చూపించారు. ఇపుడు ఎఫ్-3లో డబ్బు సంపాదించడం లేదంటూ భార్యలను వేధిస్తుండటం ప్రధానంగా చూపించనున్నారు. ఆ నేపథ్యంలో ఈ పాట రానుంది.