Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా తొలి వర్థంతి.. నటి మేఘనా రాజ్‌ ఎమోషనల్ పోస్ట్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (17:05 IST)
chiranjeevi Sarja
కన్నడ స్టార్‌ హీరో, దివంగత నటుడు చిరంజీవి సర్జా మృతి చెంది నేటితో ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్‌ ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. గతేడాది జూన్‌ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 
 
చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్‌ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తున్నారు. 
 
అంతేగాక సర్జాతో తనకున్న జ్ఞాపకాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలో చిరు, మేఘనాలు మాట్లాడుకుంటుండగా ప్రేమతో ఆమెను చూస్తున్నట్లుంది. 
 
దీనికి మేఘన ఎమోషనల్‌ క్యాప్షన్‌తో హార్ట్‌ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టు ప్రముఖ నటి, మేఘన సన్నిహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments