Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఐదో సీజన్ ఫిక్స్.. కంటిస్టంట్లుగా హైపర్‌ ఆది, శేఖర్‌ మాస్టర్‌?!

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (16:53 IST)
కరోనా కాలంలో తెలుగు బిగ్ బాస్ షో ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు ఐదో సీజన్‌ ప్రారంభం అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ కావడంతో.. అవే తరహా వాతావరణం ఉన్నప్పటికీ.. దాన్ని విజయవంతం చేయడానికి నిర్వాహకులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. 
 
వాస్తవానికి బిగ్‌బాస్ 5ను ఈ వేసవిలో ప్రారంభించాలని స్టార్ మా నిర్వాహకులు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఐదో సీజన్‌ను షురూ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. అందులో భాగంగా ఇప్పటికే అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది.
 
ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్‌ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట. ఇక ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఈ సీజన్‌లో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో హైపర్‌ ఆది, శేఖర్‌ మాస్టర్‌, మంగ్లీలు వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వాళ్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తారా లేదా అనేది కాస్త అనుమానమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments