Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా బాధిత `బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్` కుటుంబాల‌కు అండగా నిలిచిన మెగాస్టార్

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:57 IST)
chiru-charan
కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ కుటుంబాల‌కు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాల‌కు ఆర్థిక భ‌రోసానిచ్చి  ధైర్యాన్ని ఇస్తున్నారు.
 
ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాల సేవకుల‌కు ఎవరికి కరోనా సోకిన వెంటనే వారితో మాట్లాడి ధైర్యం నింప‌డం .. అవసరమైతే  మెరుగైన  వైద్య సదుపాయాలు కల్పించడం.. ఆయా ఆస్పత్రుల కు ఫోన్ చేసి డాక్టర్స్ తో మాట్లాడటం చేస్తున్నారు. ఇలా నిత్యం అభిమానులను సినీపరిశ్రమకు చెందినవారిని..అందరితో మాట్లాడుతూ ఎందరినో కాపాడుతున్నారు.
 
ఈ మధ్య కాలంలో మరణించిన హిందూపురం కు చెందిన  మెగా అభిమాని శ్రీ. K. ప్రసాద్ రెడ్డి కరోనాతో మరణించగానే వారి కుటుంబంతో మాట్లాడి ధైర్యనిచ్చి వారి శ్రీ మతి K. పద్మావతి పేరున రూ.3 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు.  అదేవిధంగా కడపకు చెందిన శ్రీ N. రవిప్రసాద్ కూడా కరోనా తో మరణించగా వారి కుటుంబాన్ని పరమర్శించడమే కాకుండా వారి అమ్మాయి ప్రియాంక పేరున 3 లక్షల  రూపాయలు ఎఫ్‌.డి చేసి క‌నీస భ‌రోసానిచ్చారు.
 
అంతేకాకుండా గాజువాకలో కరోనాతో భార్యాభర్తలు శ్రీ K. శ్రీనివాస రావు- సరస్వతి లకు వైజాగ్ లో ఆస్ప‌త్రి బెడ్ దొరక్క‌పోవ‌డంతో అధైర్యానికి గుర‌య్యారు. వారి కోసం వెంట‌నే మెగాస్టార్ సురక్ష హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి మెరుగైన వైద్యసదుపాయలు కల్పించడమే కాకుండా వారి పేరున కూడా 2 లక్షల రూపాయలు ఎఫ్‌.డి వేశారు.
 
శ్రీకాకుళం - B.S.S ప్ర‌సాద్ కుమార్ (టైకూన్ శ్రీ‌నివాస్) కరోనా బారిన పడితే వారికి ఒక లక్షరూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్నారు. ఈ విధంగా కరోనా కష్టకాలంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కేవ‌లం  అభిమానులు మాత్రమే కాదు. సినీపరిశ్రమ లో వారికి బంధువులకు మిత్రులకు త‌మ సిబ్బందికి ప్రతిరోజూ ఎన్నో గుప్త దానాలు చేస్తూనే ఉన్నారు.
 
త‌మ‌ను ఆప‌ద‌లో ఆదుకున్న ఆప‌ద్భాందవుడు మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ కుటుంబీకులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారికి సంబంధించిన సోష‌ల్ మీడియా వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ గా మారాయి. కె.ప్ర‌సాద్ రెడ్డి భార్య ప‌ద్మావతి.. బీఎస్.ఎస్ ప్ర‌సాద్ కుమార్ కుటుంబీకులు .. గాజువాక శ్రీ‌నివాస‌రావు కుటుంబీకులు ఈ సంద‌ర్భంగా చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ వీడియో సందేశాన్ని అందించారు. ఆప‌ద‌లో త‌మ‌ను ఆదుకున్న దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ బాధిత కుటుంబీకులు కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments