పోస్టాఫీస్‌లో కొన్ని రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వలన మంచి రాబడి పొందవచ్చు. ముఖ్యంగా కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్ వుంది. మీరు కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసారంటే డబ్బులు రెట్టింపు అవుతాయి.
మీ డబ్బులు 124 నెలల్లో రెట్టింపు అవుతాయి. రూ.1000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిమిట్ అంటూ ఏమి లేదు గమనించండి. ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తోంది.
అదే విధంగా దీని వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పక్కాగా డబ్బులు రెట్టింపు అవుతాయి కూడా. మీరు ఎంత డబ్బైనా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో రూ.4 లక్షలు పెడితే రూ.8 లక్షలు పొందొచ్చు. అదే విధంగా మీరు రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు తీసుకోవచ్చు.