ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేయబోతోంది గూగుల్. గూగుల్ I/O 2021 ఈవెంట్‌లో ఈ కొత్త ఫీచర్స్‌ని ప్రకటించింది. ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను గూగుల్ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ ప్రకటించారు.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో రాబోయే కొత్త ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్‌ని ప్రకటించారు. ఆండ్రాయిడ్ 12 యూజర్ ఇంటర్‌ఫేస్‌లో కూడా భారీగా మార్పులు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12లో కొత్తగా ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ కనిపించబోతోంది. ఇందులో మీరు యాప్స్‌కు ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. యాప్స్‌కి పర్మిషన్స్ కూడా తొలగించొచ్చు. అలాగే గూగుల్ ఇప్పటికే పాస్‌వర్డ్ మేనేజర్ ఫీచర్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపై థర్డ్ పార్టీ మేనేజర్ నుంచి మీ పాస్‌వర్డ్స్‌ని సులువుగా గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక ఇండికేటర్ అలెర్ట్, ఫోల్డెర్ లాక్, లొకేషన్ హిస్టరీ, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు వున్నాయి. ఆండ్రాయిడ్ 12 కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత బ్యాటరీ చాలావరకు ఆదా అవుతుంది.
సీపీయూ టైమ్ 22 శాతం, సిస్టమ్ సర్వర్ 15 శాతం తగ్గుతుందని గూగుల్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌లో మీకు రిమోట్ యాప్ కూడా రానుంది. దీంతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే మీ టీవీని ఆపరేట్ చేయొచ్చు.
అలాగే నియర్‌బై బటన్ ద్వారా క్యూఆర్ కోడ్ షేర్ చేసి మీ వైఫై కనెక్షన్ షేర్ చేయొచ్చు. వన్ హ్యాండెడ్ మోడ్ రాబోతోంది. ఒక చేత్తో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.