Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌కు మరో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్...

Advertiesment
Oxygen Concentrator
, గురువారం, 20 మే 2021 (17:13 IST)
రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌కు మరో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఎంపి మిథున్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్‌ల సమకూర్చారు. వీరిద్దరూ ఐదేసి చొప్పున అందిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను  గురువారం కోవిడ్ సెంటర్‌కు నోడల్ అధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యులు డా సృజన్‌కు మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషాకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందచేతలో ఎంపి మిథున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ లసహకారం అభినందనీయమన్నారు. కోవిడ్ కేర్ సెంటరులో 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందుబాటులో ఉన్నాయని, ఇందులో 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఎంపి మిథున్ రెడ్డి అందించారని తెలిపారు.
 
ఎంపి మిథున్ రెడ్డి అందించిన కోటి రూపాయల నిధులతో 500 ఎల్పీ సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్‌ను రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలవడం జరిగిందన్నారు. త్వరితగతిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణపనులును పూర్తిచేయిస్తామన్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
రాయచోటి కోవిడ్ ఆసుపత్రి అయిన అమరావతిలో 22, రాయచోటి ఏరియా ఆసుపత్రిలో 3, లక్కిరెడ్డిపల్లె ఏరియా ఆసుపత్రిలో 2ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంపి మిథున్ రెడ్డి సహకారంతో ఏపిఎస్ఎం డిసి తరపున నేడో, రేపో రానున్న 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను నియోజక వర్గ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అందచేస్తామని ఆయన తెలిపారు. 
 
తిరుపతి రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి కూడా 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను  త్వరలోనే దచేయనున్నారన్నారు. 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మరికొన్నింటిని కొనుగోలు చేసి రాయచోటిలోని కోవిడ్ కేర్ సెంటర్, ఏరియా ఆసుపత్రికి అందచేస్తామన్నారు. కోవిడ్ బారిన పడిన విలేఖరులు, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు,మున్సిపల్, రెవెన్యూ, పారిశుధ్యపు కార్మికులు తదితర కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్, అమరావతి ఆసుపత్రి‌లలో రెండేసి ఆక్సిజన్ బెడ్లు ప్రత్యేకంగా కేటాయించాలని ఆయన అధికారులుకు సూచించారు. 
 
కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలందరూ రెండు వారాలపాటు అత్యంత జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కోవిడ్ లక్షణాలుతో బాధపడే వారు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి వైద్యం పొంది ఆరోగ్యవంతులు కావాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌ను తాకిన వైట్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరం..