Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన మెగాస్టార్ చిరంజీవి- గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (17:23 IST)
Chiranjeevi, Godfather
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే  ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు  అధ్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.
 
మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచి మేర‌కు మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ మీద అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన  లెటెస్ట్ అప్డేట్  ఇచ్చారు మేక‌ర్స్‌. 
 
ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం (నవంబర్ 1) నాడు ప్రారంభమైంది.  ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెరకెక్కిస్తున్నారు.
 
మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా, నిర్మాతలు : ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద, సంగీతం : ఎస్ఎస్ తమన, సినిమాటోగ్రఫర్ : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

సామాన్య భక్తుడిలా నేలపై పడుకున్న టీడీడీ బోర్డు సభ్యుడు... (Video)

సినీ నటి నవనీత్ కౌర్‌పై దాడికియత్నం ... 45 మంది అరెస్టు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments