పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు ఆదివారంనాడు తన ప్ర,గాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబంతో మా నాన్నగారు చాలా స్నేహంగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు. మూడు రోజులక్రితం పునీత్ గురించి వార్త కొంచెం కొంచెం వస్తుండే ఏమిటి ఈ జీవితం? అనిపించింది. ఒక్క నిముషంలోనే అంతా అయిపోయింది. ఆయన చనిపోయారని తెలిసినప్పుడు ఊహించని షాక్‌కు గురయ్యాను.
మనిషి జీవితం. ఏమిటి ఇలా జరుగుతుందని ఆలోచించాను. చాలా బాధపడ్డాను. తక్కువ వయస్సులో ఆయన కాలం చేయడం ఊహించలేనిది. కర్నాటక మొత్తం వారి కుటుంబపై చూపిన ప్రేమను చూస్తే వారి అభిమానం ఎంతలా వుందో అర్థమయింది. జీవితం చాలా చిన్నది. పాజిటివ్‌గా అందరితో వుండాలి. ఎమోషనల్ అనేవి ఓ భాగం మాత్రమే. ఎప్పుడూ బీ పాజిటివ్.. అలవర్చుకోవాలి. ఇది చెప్పడానికి బాగానే వుంటుంది. కానీ మనం చేతల్లో చేయలేం. కానీ అలవర్చుకోవాలి.
ఇక జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా బాలీ బిల్డప్ వల్ల చనిపోయాడా? అనేది నాకూ కరెక్ట్‌గా తెలీదు. ఏది ఏమైనా ఇలాంటి చేసేటప్పుడు డాక్టర్ల సలహా తీసుకోవాలి. లైఫ్ మోడరేషన్‌లోనే జీవించాలి. కానీ ఒత్తిడికి గురికాకూడదు. బాడీ పెంచుకోవడానికి స్టెరాయిడ్స్ వాడకూడదు. డాక్టర్లు ఇలాంటి వారికి చెప్పకూడదు. ఇది నేను మన తెలుగు సీమలోనూ హీరోలు బాడీ బిల్డప్ చేస్తుంటారు. కానీ పరిమితి మేరకు చేయాలి. ఇది అందరినీ ఉద్దేశించి చెపుతున్నదే. మరణం అనేది మన చివరి అంచున అంటిపెట్టుకుని వుంటుంది. చాలా మెళుకువతో వుండాలి అని తెలిపారు.