Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర‌ల‌హ‌రి ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన చిత్రం... మెగాస్టార్ చిరంజీవి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:22 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయితేజ్ న‌టించిన తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోండ‌డంతో చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. 
 
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... కిషోర్ తిరుమ‌ల `చిత్ర‌ల‌హ‌రి` చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. ఇక తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చ‌క్క‌గా న‌టించాడు. పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించి నిండుద‌నం తెచ్చారు. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. 
 
స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌కు మైత్రీ మూవీస్ సంస్థ అడ్ర‌స్‌గా నిలుస్తుంది. వారి ప్ర‌తిష్ట‌ను మ‌రింత నిల‌బెట్టుకునే ఈ సినిమాను రూపొందించారు. బంధాలు, అనుబంధాలు గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మ‌ధ్య అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారు. ఎలాంటి ఒడుదొడుకులు వ‌చ్చినా మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డానికి కృషితో ముందుకు వెళ్లాల‌ని చెప్పిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఈ వేస‌వికి విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి` ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం. సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్ష‌లు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments