Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో మెగా హీరో సినిమా చేస్తున్నాడా..?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (20:44 IST)
మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అదీ కూడా త‌ను ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వ‌స్తున్న టైమ్‌లో ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌డం అంటే రిస్కే. అయినా కానీ.. రిస్క్ చేయ‌డానికి సై అంటున్నాడు ఈ మెగా హీరో. చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ఆశించిన స్థాయిలో స‌క్స‌ెస్ సాధించ‌లేక‌పోయినా.. ఫ‌ర‌వాలేద‌నిపించాడు. 
 
ఇక ప్ర‌తిరోజు పండ‌గే కూడా యూనిమ‌స్‌గా హిట్ టాక్ రాక‌పోయినా ఈ వారంలో వ‌చ్చిన సినిమాల్లోకెల్లా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. ఇలా చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తి రోజు పండ‌గే సినిమాల‌తో తేజు ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడి సుబ్బుతో సోలే బ‌తుకే సో బెట‌ర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుది. 
 
అయితే... ఈ సినిమా సెట్స్ పైన ఉండ‌గ‌నే సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ ప్లాప్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇంత‌కీ ఎవ‌రా ఫ్లాప్ డైరెక్ట‌ర్ అంటారా..? దేవ‌క‌ట్టా. ప్ర‌స్థానం సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన దేవ‌క‌ట్టా ఆ త‌ర్వాత ఆటోన‌గ‌ర్ సూర్య సినిమా చేసాడు. ఈ మూవీ స‌క్స‌ెస్ కాలేదు. ఆ త‌ర్వాత మంచు విష్ణుతో చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కూడా మెప్పించ‌లేక‌పోయింది. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కోసం ఇంటెన్ష్ ఉన్న స్టోరీ రెడీ చేసాడ‌ట‌. ప‌క్కా మాస్‌గా ఉండే ఈ మూవీ ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. 
 
మ‌రి.. ఈ సినిమాతో అయినా దేవ‌క‌ట్టా మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడా..? తేజు చేస్తున్న ఈ రిస్క్ స‌క్స‌ెస్ అవుతుందా..? లేదా..? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments