Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనిపోయిన మెగా అభిమాని... ఇంటికెళ్లిన చిరంజీవి

చనిపోయిన మెగా అభిమాని... ఇంటికెళ్లిన చిరంజీవి
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:46 IST)
సాధారణంగా మెగా కుటుంబానికి బలం.. బలగం, బలహీనత వారి అభిమానులే. అభిమానులే మా కుటుంబం అంటూ పలుమార్లు మెగా ఫ్యామిలీ హీరోలు పలు వేదికలపై ప్రకటించారు. అలాంటి అభిమానుల్లో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వీరాభిమానుల్లో ఒకరైన నూర్ మహ్మద్.. ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికెళ్లి బంధువులను పరామర్శించారు. 
 
తన వీరాభిమాని మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు. అంతేకాకుండా, మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు కూడా స్పందించారు. 
 
'మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు. నూర్‌ బాయ్‌ మా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన మృతి మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము' అని గీతా ఆర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
తనకు ఎంతో ఇష్టమైన అభిమాని మృతి విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. వెంటనే అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించి, నూర్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
'అభిమానులే మా కుటుంబం. మా ఫ్యామిలీని ఎంతగానో అభిమానించే నూర్ మహమ్మద్‌‌‌గారు లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన సానుకూల దృక్పథం, సేవాగుణం ఇప్పటివారికి బెంచ్ మార్క్ వంటిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. 
 
'మెగా అభిమాన కుటుంబంలోని బలమైన మూల స్థంభం కుప్పకూలిపోయింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నూర్ భాయ్ ఆత్మకు శాంతిచేకూరాలి' అని సాయి తేజ్ వ్యాఖ్యానించారు. 
 
'మమ్మల్ని ఎంతగానో అభిమానించే నూర్ భాయ్ ఇక లేరని తెలిసి షాకయ్యా. ఎంతో బాధగా ఉంది. ఆయన మా కుటుంబంలోని మనిషి. మా పుట్టినరోజుల్ని ఆయన తన పుట్టినరోజుగా జరిపేవాడు. పండగల సమయంలో మంచి వంటకాలు పంపించి.. మాపై ఎంతో అభిమానాన్ని కురిపించేవాడు. ఆయన మృతి మా కుటుంబానికి తీరని లోటు' అని అల్లు శిరిష్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది సింహంరా... వెంటాడి వేటాడి చంపుద్ది : రూలర్ ట్రైలర్